Telugu News » Kishan Reddy : కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతోంది…!

Kishan Reddy : కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతోంది…!

ఆ కుంభకోణాల వల్లే కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ దూరమైందన్నారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగి పోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు.

by Ramu
kishan reddy fire on congress

కాంగ్రెస్ (Congress) హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆ కుంభకోణాల వల్లే కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ దూరమైందన్నారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగి పోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని ఎద్దేవా చేశారు.

kishan reddy fire on congress

బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం శక్తి వందన్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. దేశంలో ఎలాంటి అవినీతి లేకుండా మోడీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో కనీసం రహదారులు కూడా ఉండేవి కాదన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

మోడీ ఆధ్వర్యంలో సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నామన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలను మోడీ స్వయంగా సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారని పేర్కొన్నారు. మోడీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదని… అందుకే ఏదో ఓ రకంగా మోడీపై కొన్ని పార్టీల నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

‘రాష్ట్రంలో 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశాం. భారతీయులంటే గతంలో అవమానించే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. భారత పాసు పోర్టు ఉంటే గౌరవం దక్కుతోంది. ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ పరిపాలిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 7లక్షల కోట్ల అప్పులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది’అని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు. గతంలో తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. గత ఎన్నికలకు వారం అటూ ఇటూగా ఎన్నికలు జరగవచ్చని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అహంకారంతో సిగ్గు లేకుండా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. దేశంలో ఏ నాయకులు కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడరని విమర్శించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.

 

You may also like

Leave a Comment