Telugu News » Telangana : శ్వేతపత్రం పై సభలో సమరం…అసెంబ్లీలో తెలంగాణ అప్పుల చిట్టా..!!

Telangana : శ్వేతపత్రం పై సభలో సమరం…అసెంబ్లీలో తెలంగాణ అప్పుల చిట్టా..!!

తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు ఉండగా బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చిన పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగినట్టు వెల్లడించింది. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం ఉన్నదని.. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి 4.98 లక్షల కోట్ల వ్యయం పెరిగితే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగిందని వివరించింది.

by Venu

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఇంతలా ఎందుకు అప్పులపాలు అయ్యింది? కేసీఆర్ ఇచ్చిన మాటతప్పి సీఎం అయ్యింది భారీగా ఆస్తులు కూడా బెట్టుకోవడానికా..? రెండో సారి వేరే వాళ్ళని సీఎం చేసే ఛాన్స్ ఉన్నా తానే మళ్ళీ అధికారపీఠం పై ఎందుకు కూర్చున్నట్టు? అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామని టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు? సామాన్యులలో తలెత్తుతోన్న ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెబుతారు? అని మేధావులు ప్రశ్నలు సంధిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం పరువు కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా నేడు తెలంగాణ (Telangana) ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది హస్తం.. 42 పేజీలతో కూడుకొన్న శ్వేతపత్రంలో ఎన్నో కీలక విషయాలు పొందుపరచినట్టు తెలుస్తోంది.. కాగా 2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం.. తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లని వివరించింది..

తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు ఉండగా బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చిన పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగినట్టు వెల్లడించింది. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం ఉన్నదని.. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి 4.98 లక్షల కోట్ల వ్యయం పెరిగితే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగిందని వివరించింది.

కాగా ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లు.. ఎస్పీవీల ద్వారా సేకరించిన రుణం లక్షా 27వేల కోట్లని తెలిపింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) విడుదల చేశారు. విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయిన గత ప్రభుత్వం.. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదని పేర్కొన్నారు. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది పది రోజులకు తగ్గిందని తెలిపారు.

మరోవైపు రోజువారి ఖర్చులకు కూడా ఆర్‌బీఐ (RBI)పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని శ్వేతపత్రంలో వివరించారు.. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణంఅని పేర్కొన్నారు. ఇక తాము 6 గ్యారంటీలను అమలు చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని భట్టి తెలిపారు. అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు.

You may also like

Leave a Comment