Telugu News » Development: ఎలాంటి భేషజాలు లేవు.. మంచి నిర్ణయాలు కొనసాగిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Development: ఎలాంటి భేషజాలు లేవు.. మంచి నిర్ణయాలు కొనసాగిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ (Hyderabad)లోని హోటల్ వెస్టిన్‌(Hotel Westin)లో సీఐఐ(CII) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భేషజాలు లేవని, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు.

by Mano
Development: There is no rhetoric.. We will continue to make good decisions: CM Revanth Reddy

కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భేషజాలు లేవని, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని హోటల్ వెస్టిన్‌(Hotel Westin)లో సీఐఐ(CII) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు.

Development: There is no rhetoric.. We will continue to make good decisions: CM Revanth Reddy

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు(Investors) పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. గత పాలకుల నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారిందని గుర్తు చేశారు. ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.

గతంలో అవుటర్‌ రింగ్ రోడ్డు అవసరం లేదని కొందరన్నారని, ఇప్పుడది హైదరాబాద్‌కు లైఫ్‌లైన్‌గా మారిందని సీఎం వివరించారు. అదేవిధంగా తెలంగాణలో విద్య ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో 64 ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు  సీఎం తెలిపారు.

స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపక అవకాశాలు అనే అంశంపై ప్రసంగిస్తూ ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్‌ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో వేధింపులు ఉంటాయేమోనని వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

You may also like

Leave a Comment