Telugu News » Devi navaratrulu: తెలుగు రాష్ట్రాల్లో కనుల పండువగా శరన్నవరాత్రోత్సవాలు

Devi navaratrulu: తెలుగు రాష్ట్రాల్లో కనుల పండువగా శరన్నవరాత్రోత్సవాలు

తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రోత్సవాలు(Devi sharannavaratrulu) వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలోని నిర్మల్(Nirmal) జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం(Sarasvati devi temple)లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

by Mano
Devi navaratrulu: Sharannavaratra festivals as an eye festival in Telugu states

ఇందులో భాగంగా 7వ రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి అష్టోత్తర నామార్చన చతుషష్టి ఉపచార వంటి పూజలను వేద పండితులు నిర్వహించారు. మల్లె పుష్పార్చన ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

అదేవిధంగా అమ్మవారికి కిచిడి, రవ్వకేసరి వంటి నైవేద్యాలను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఏపీలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు సోమవారం అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు.

Devi navaratrulu: Sharannavaratra festivals as an eye festival in Telugu states

ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు కలగకుండా భక్తులను పోలీసులు అదుపుచేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరగా తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment