Telugu News » Dhawal Kulkarni: రిటైర్మెంట్ ప్రకటన.. టీమిండియా క్రికెటర్ ఎమోషనల్..!

Dhawal Kulkarni: రిటైర్మెంట్ ప్రకటన.. టీమిండియా క్రికెటర్ ఎమోషనల్..!

ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ కులకర్ణికి చివరి మ్యాచ్.

by Mano
Dhawal Kulkarni: Retirement Announcement.. Team India Cricketer Emotional..!

టీమిండియా క్రికెటర్(Team India Cricketer) ధావల్ కులకర్ణి(Dhawal Kulkarni) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ కులకర్ణికి చివరి మ్యాచ్.

Dhawal Kulkarni: Retirement Announcement.. Team India Cricketer Emotional..!

ఈ మ్యాచ్‌లో కులకర్ణి ముంబై జట్టును గెలిపించాడు. విదర్భతో జరిగిన ఫైనల్‌లో ధావల్ కులకర్ణి తొలి ఇన్నింగ్స్ మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీశాడు. ఫైనల్‌లో చివరి విదర్భ వికెట్ తీసిన తర్వాత 35 ఏళ్ల కులకర్ణి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చివరి మ్యాచ్ ఆడుతున్న కులకర్ణికి.. మ్యాచ్ ముగించాలని ముంబై కెప్టెన్ అజింక్య రహానే బంతిని అందించాడు. ఉమేశ్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనంతరం కులకర్ణి ఎమోషనల్ అయ్యాడు. ఆటగాళ్లను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

ధావల్ కులకర్ణి తన కెరీర్‌లో 95 ఫస్ట్ క్లాస్, 130 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 281 వికెట్లు, లిస్ట్-ఏ మ్యాచ్ 154 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు భారత్ తరఫున కులకర్ణి 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 92 ఐపీఎల్ మ్యాచులలో 86వికెట్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు 22 వికెట్లు తీశాడు.

You may also like

Leave a Comment