Telugu News » Earthquake : మణిపూర్ లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే..?

Earthquake : మణిపూర్ లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే..?

ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసింది.

by Venu
Earthquake in Ladakh: Huge earthquake.. 4.5 intensity on the Richter scale..!

ప్రపంచాన్ని వణికిస్తున్న భూకంపాల (Earthquake) కారణంగా జనం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.. తరచుగా చోటు చేసుకొంటున్న వీటివల్ల అపారమైన నష్టాలు కూడా సంభవిస్తున్న ఘటనలున్నాయి.. కాగా తాజాగా దేశంలో మరోసారి భూమి కంపించింది. ఈరోజు తెల్లవారుజామున మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.9 గా నమోదైందని అధికారులు పేర్కొన్నారు..

Afghanistan: Earthquake again in Afghanistan.. How many times in 15 days..!!మణిపూర్‌లో (Manipur)ని ఉఖ్రుల్‌ (Ukhrul)లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నేడు తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసింది. మొదట మంగళవారం పశ్చిమ మేఘాలయలో తేలికపాటి తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు..

పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో మధ్యాహ్నం 2:27 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ఐదు కిలోమీటర్ల లోతులో ఉందని ప్రాంతీయ భూకంప కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.. మరోవైపు భూకంపం వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదో వారు వివరించారు.. ఒకవేళక భూకంపం సభవించిన సమయంలో మీరు భవనం లోపల ఉంటే, నేలపై కూర్చుని, బలమైన ఫర్నిచర్ కిందకు వెళ్లండని తెలుపుచున్నారు..

టేబుల్ లేదా అలాంటి ఫర్నిచర్ లేకపోతే.. ముఖం, తలపై చేతులతో కప్పి, గదిలో ఒక మూలలో వంగి కూర్చోండని అంటున్నారు.. ఒకవేళ మీరు భవనం బయట ఉన్నట్లయితే, పెద్ద కట్టడాలు, భవనం, చెట్లు, స్తంభాలు, తీగల నుంచి దూరంగా వెళ్లండి. వాహనంలో ప్రయాణిస్తుంటే, వీలైనంత త్వరగా వాహనాన్ని ఆపి వాహనంలోనే కూర్చోండని తెలుపుతున్నారు.. మీరు శిధిలాల కుప్ప కింద ఖననం చేయబడితే, ఎప్పుడూ అగ్గిపెట్టె వెలిగించకండి, దేనినీ కదల్చడం, లేదా నెట్టడం వంటివి చేయవద్దని అంటున్నారు..

మీరు శిథిలాల కింద కూరుకుపోయినట్లయితే, రెస్క్యూ వర్కర్లు మీ పరిస్థితిని అర్థం చేసుకునేలా ఏదైనా పైపు లేదా గోడపై తేలికగా నొక్కండి. లేదా మీకు విజిల్ ఉంటే దాన్ని ఊదండి. అప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే శబ్దం చేయండి. శబ్దం చేయడం వల్ల దుమ్ము, ధూళితో ఉన్న పరిసరాలు మీ శ్వాసలో చేరి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుందని అంటున్నారు.

You may also like

Leave a Comment