Telugu News » Divyavani: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రముఖ నటి..!

Divyavani: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రముఖ నటి..!

బుధవారం ప్రముఖ సినీనటి దివ్యవాణి(Actress Divya Vani) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మానిక్ రావుఠాక్రే సమక్షంలో దివ్యవాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

by Mano
Divyavani: Famous actress wearing Congress scarf..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) అసంతృప్తులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరుతున్నారు.

Divyavani: Famous actress wearing Congress scarf..!

వరుస చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ సినిమా గ్లామర్‌ను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. తాజాగా బుధవారం ప్రముఖ సినీనటి దివ్యవాణి(Actress Divya Vani) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మానిక్ రావుఠాక్రే సమక్షంలో దివ్యవాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

దివ్య వాణి 2019లో టీడీపీలో చేరారు. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో పార్టీలో దివ్యవాణి చురుకుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ దివ్యవాణి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఉన్నట్టుండి 2022లో పార్టీని వీడారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై పలు ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనడంతో దివ్యవాణి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సినిమా గ్లామర్‌ కోసం కాంగ్రెస్ దివ్యవాణిని పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆమెకు పార్టీలో ఏ స్థానం కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది.

You may also like

Leave a Comment