Telugu News » DK Aruna: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అందుకే ఇచ్చిందా?: డీకే అరుణ

DK Aruna: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అందుకే ఇచ్చిందా?: డీకే అరుణ

బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులు ఇస్తుందనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.

by Mano
DK Aruna: Is that why the Congress party gave six guarantees?: DK Aruna

బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం(Kaleshwaram) అవినీతిపైనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదటూ ఆరోపించారు.

DK Aruna: Is that why the Congress party gave six guarantees?: DK Aruna

కాంగ్రెస్ ప్రజాపాలనకు వంద రోజుల సమయం అడిగారని, అయితే వారు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలని డీకే అరుణ సూచించారు. కేంద్రం నిధులు ఇస్తుందనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పక వస్తాయన్నారు. గతంలో కూడా పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టడం చూస్తుంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తోందని డీకే అరుణ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జుడిషియల్ ఎంక్వైరీ అంటే కాలయాపన చేయడమే అని ఆరోపించారు. మెడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం పంపులు మునగడం ప్రాజెక్టు డిజైన్ లోపం, నాణ్యత లోపమే కారణమని అన్నారు. వెంటనే చర్యలు తీసుకునే విధంగా సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు.

 

You may also like

Leave a Comment