ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న తెలంగాణ (telangana) ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ప్రతిపక్షాలను పాతాళంలో కలిపేశారు కేసీఆర్ (KCR)..ఈ క్రమంలో టీడీపీ (TDP)..కాంగ్రెస్ (Congress) పార్టీలు కూడా కేసీఆర్ వ్యూహా ప్రవాహంలో గల్లంతు అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ కనుమరుగవ్వగా.. కాంగ్రెస్ కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ గెలుపు కోసం పోరాటం చేసింది.
మరోవైపు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పాలిస్తూ.. ప్రతిపక్షాలకు తావివ్వకుండా అధికారాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అయితే అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనక ఓ మాస్టర్ మైండ్ కీలకంగా మారింది.. దీంతో మూగబోయిన కాంగ్రెస్ పార్టీకి గెలుపు పిలుపును అందించిన ఆ మాస్టర్ మైండ్ ఎవరినే చర్చ రాజకీయాల్లో మొదలైంది.
తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజానికి గద్దె దింపి.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకోవడం వెనక ఉన్న ఆ మాస్టర్ మైండ్ సునీల్ కనుగోలు (Sunil Kanugolu)..కాంగ్రెస్ రాష్ట్రంలో చాపకింద నీరులా పాకి పాతుకుపోవడానికి కారణం సునీల్ కనుగోలు వ్యూహాలే కారణం అంటున్నారు. అదీగాక ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించటం వెనుక ఉన్నది కూడా సునీల్ కనుగోలు అని చెబుతున్నారు.
మరోవైపు సునీల్ కనుగోలు వ్యూహ చతురతకు మెచ్చిన కర్ణాటక సర్కారు.. క్యాబినెట్ మినిస్టర్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అయితే.. ఇప్పటివరకు దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిశోర్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ప్రస్తుతం సునీల్ కనుగోలు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిశోర్ సహచరుడే కావడం విశేషం..