రిపబ్లికన్ పార్టీ(Republican Party) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే తొలి విజయం సాధించిన ఆయనకు మరో భారీ విక్టరీ సొంతం చేసుకున్నారు.
హ్యాంప్‌షైర్ ప్రైమరీ(Hampshire Primary)లో ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. దీంతో దాదాపు ఆయనకు అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, న్యూ హ్యాంప్‌షైర్ డోనాల్డ్ ట్రంప్‌నకు 55శాతం ఓట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
ఇక, రెండవ స్థానంలో నిక్కి హేలీ నిలిచింది. వారం కిందట ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్ షైర్లో 22 మంది డిలీగేట్స్ ఉండగా.. అందులో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నట్లు సమాచారం.
కాగా, రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఒకవేళ హేలీ ఉన్నా తాను పట్టించుకోనని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆమె ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు అని తెలిపారు. అయితే సౌత్ కరోలినాలో జరిగే ప్రైమరీ రేసులో మాత్రం తానే విజయం సాధిస్తానంటూ నిక్కీ హేలీ ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.