Telugu News » Donald Trump: ‘ఆ తీర్పు రద్దు చేయరూ..’ సుప్రీంకోర్టుకు డొనాల్డ్‌ ట్రంప్‌ రిక్వెస్ట్..!

Donald Trump: ‘ఆ తీర్పు రద్దు చేయరూ..’ సుప్రీంకోర్టుకు డొనాల్డ్‌ ట్రంప్‌ రిక్వెస్ట్..!

గతేడాది డిసెంబర్‌ నెలలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో(Colorado) సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కొలరాడో కోర్టు తీర్పును యూఎస్‌ సుప్రీం కోర్టును (US Supreme Court) ట్రంప్‌ అభ్యర్థించారు.

by Mano
Donald Trump: 'Don't cancel that verdict..' Donald Trump's request to the Supreme Court..!

అధ్యక్ష పీఠాన్ని రెండో సారి కైవసం చేసుకోవలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు(Donald Trump) తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు యూఎస్‌ క్యాపిట్‌ దాడి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఏం పాలుపోని స్థితిలో ఉన్నాయి.

Donald Trump: 'Don't cancel that verdict..' Donald Trump's request to the Supreme Court..!

గతేడాది డిసెంబర్‌ నెలలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో(Colorado) సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కొలరాడో కోర్టు తీర్పును యూఎస్‌ సుప్రీం కోర్టును (US Supreme Court) ట్రంప్‌ అభ్యర్థించారు. తాజాగా దానిని రద్దుచేయాలని కోరుతూ మంగళవారం యూఎస్‌ సుప్రీం కోర్టులో ట్రంప్‌ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలరాడో కోర్టు ఉత్తర్వులను అమలుచేయానికి అనుమతించినట్లయితే అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్న అభ్యర్థికి ప్రజలు ఓట్లేయకుండా చేసినట్లవుతుందని, ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, కొలరాడో కోర్టు తీర్పు వెలువరించి పట్టుమని 10 రోజులైనా గడవకముందే మైన్‌ రాష్ట్రం కూడా ఆయనకు షాక్‌ ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ట్రంప్‌ అనర్హుడని స్పష్టం చేసింది.

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్‌ రాష్ట్రంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాలు చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షెన్నా బెల్లోస్‌.. ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తున్నట్లు గతవారం ప్రకటించారు. దీంతో బెల్లోస్‌ నిర్ణయాన్ని మైన్‌ కోర్టులో సవాలు చేయనున్నట్లు ట్రంప్‌ మద్దతుదారులు తెలిపారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యూఎస్‌ క్యాపిటల్‌పై దాడికి దిగిన విషయం విదితమే. వారిని సమర్ధించి, హింసను ప్రేరేపించినట్లు ట్రంప్‌పై అభియోగాలున్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది.

You may also like

Leave a Comment