Telugu News » Khammam : ఖమ్మం జిల్లాలోడ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు.. 4 కోట్ల 35 లక్షల విలువైన ముడి సరుకు స్వాధీనం..!!

Khammam : ఖమ్మం జిల్లాలోడ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు.. 4 కోట్ల 35 లక్షల విలువైన ముడి సరుకు స్వాధీనం..!!

గోడౌన్‌లో నిషేధిత డ్రగ్‌ తయారు చేస్తున్న నిందితుడు సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అనుమతి లేకుండా నిషేధిత డ్రగ్స్‌ తయారీకి పాల్పడుతోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.. మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా డ్రగ్స్‌ తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి..

by Venu

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు డ్రగ్స్‌ ముఠాల పై ఉక్కుపాదం మోపుతోన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అమ్మకాలపై దృష్టి సారించిన పోలీసులు.. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొంటున్న వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో డ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు..

ఖమ్మం (Khammam) జిల్లా, తల్లాడ (Tallada) మండలంలోని అన్నారం గూడెం (Tallada Annaram Gudem)లో ఉన్న ఓ గోడౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకొన్న డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులు.. శనివారం గోడౌన్‌పై దాడులు నిర్వహించారు.. ఈ దాడుల్లో 4 కోట్ల 35 లక్షల విలువైన 935 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.

గోడౌన్‌లో నిషేధిత డ్రగ్‌ తయారు చేస్తున్న నిందితుడు సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అనుమతి లేకుండా నిషేధిత డ్రగ్స్‌ తయారీకి పాల్పడుతోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.. మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా డ్రగ్స్‌ తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి.. యువతి యువకుల్ని టార్గెట్ చేసుకొని అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు కొందరు దుర్మార్గులు.. ఈ విషయంలో ప్రభుత్వం.. అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్న.. ఈ దారుణాలు ఆగడం లేదు.. యువత భవిష్యత్తు మాదక ద్రవ్యాల ముసుగులో నాశనం అవుతోందనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో కలుగుతున్నాయి..

You may also like

Leave a Comment