Telugu News » Bejawada : తొలి రోజు బాలాత్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ..

Bejawada : తొలి రోజు బాలాత్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ..

అక్టోబరు 20న మూలా నక్షత్రం ఉంది. ఈ రోజున సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనానికి తెల్లవారుజూమున 2 నుంచి రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లో వచ్చిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాధారణంగా దసరా మొదటి రోజున స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చే అమ్మవారు ఈసారి బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు.

by Venu

ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై బెజవాడ (Bejawada) దుర్గమ్మ (Durgamma) దసరా (Dussehra) శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా మొదలైయ్యాయి. అక్టోబరు 15 నుంచి 23 వరకు అంటే 9 రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. 15వ తారీఖు ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకి సర్వదర్శనానికి అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతి ఉంటుంది.

మరోవైపు అక్టోబరు 20న మూలా నక్షత్రం ఉంది. ఈ రోజున సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనానికి తెల్లవారుజూమున 2 నుంచి రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లో వచ్చిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాధారణంగా దసరా మొదటి రోజున స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చే అమ్మవారు ఈసారి బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు.

23న విజయదశమిని పురస్కరించుకొని ఉదయం 10.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తుల తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇక తిరుమల (Thirumala) లో కూడా నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభం అయ్యాయి.

నేటి నుంచి 23వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఇవాళ్టి నుంచి బ్రహ్మోత్సవాలు షురూ కానున్న నేపధ్యంలో తమిళనాడు నుంచి పూలమాలలు.. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు నుంచి 5 టన్నుల పూలు శ్రీవారి కోసం తెప్పించారు..

You may also like

Leave a Comment