ఏపీ (AP) ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం (Governament)కీలక అలర్జ్ (Alert) జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఆఫీసు (E-Office) సేవలకు అంతరాయం కలగనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ సేవలు వారం రోజుల పాటు నిలిచి పోనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌ల సేవలను నిలిచిపోతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు అప్ డేట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్ సేవలు నిలిచిపోతాయన్నారు. ఈ వారం రోజుల పాటు ఆయా కార్యాలయాల్లో అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు ఫిబ్రవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుందని వెల్లడించారు.
అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అత్యవసర ఉత్తరప్రత్యుత్తరాలు జరిగేందుకు అవసరమయ్యే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త వెర్షన్‌పై ఈ నెల 23,24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేస్తామని ఐటీ శాఖ పేర్కొంది.