Telugu News » Earthquake: రెండు రాష్ట్రాల్లో హడలెత్తిస్తున్న వరుస భూప్రకంపనలు..  !

Earthquake: రెండు రాష్ట్రాల్లో హడలెత్తిస్తున్న వరుస భూప్రకంపనలు..  !

హింగోలి (Hingoli) నగరంలో గురువారం ఉదయం 10నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు పేర్కొంది. మొదటిసారి ఉదయం 6:08 గంటల సమయంలో భూమి కంపించింది.

by Mano

మహారాష్ట్ర (Maharashtra), అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)లో వరుస భూకంపాలు (Earthquakes) హడలెత్తిస్తున్నాయి. గురువారం ఉదయం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.

Earthquake: A series of earthquakes in two states..!

హింగోలి (Hingoli) నగరంలో గురువారం ఉదయం 10నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు పేర్కొంది. మొదటిసారి ఉదయం 6:08 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. ఆ తర్వాత 6:19 గంటలకు రెండో సారి భూమి కంపించింది.

అప్పుడు రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ భూకంపాలు వణికిస్తున్నాయి.

రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. ముందుగా తెల్లవారుజామున 01:49 గంటల సమయంలో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత 03:40 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది.

You may also like

Leave a Comment