Telugu News » Earthquake: చైనా, జపాన్‌లో భారీ భూకంపం…!!

Earthquake: చైనా, జపాన్‌లో భారీ భూకంపం…!!

రిక్టర్ స్కేల్‌పై 5.5తీవ్రత నమోదైంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (China Seismic Networks Center) పేర్కొంది.

by Mano
Taiwan: Trembling Taiwan.. once again a huge earthquake..!

తైవాన్‌(Taiwan)లో సంభవించిన భారీ భూకంపం(Earthquake) మరువకముందే చైనా, జపాన్‌లో భూకంపం వచ్చింది. వాయువ్య చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లోని మంగ్యా నగరంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 5.5తీవ్రత నమోదైంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (China Seismic Networks Center) పేర్కొంది.

Earthquake: Huge earthquake in China, Japan...!!

మరోవైపు జపాన్‌(Japan)లో హోన్షు తూర్పు తీరంలో భూమి కంపించగా 6.3 తీవ్రత నమోదైంది. దీని భూకంప కేంద్రం 32కిలోమీటర్ల లోతుతో నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(European-Mediterranean Seismological Center) పేర్కొంది. అయితే ఈ రెండు భూకంపాలకు సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు చైనా సమీపంలోని తైవాన్‌లో బుధవారం 7.5తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా, జపాన్‌లలో ప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తైవాన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతిచెందగా వెయ్యి మందికిపైగా గాయాలపాలైనట్లు సమాచారం. 50మందికి పైగా గల్లంతుకాగా అందులో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా 100కు పైగా భవనాలు, పలు రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

You may also like

Leave a Comment