తూర్పుగోదావరి (East Godavari) జిల్లా నిడదవోలు (Nidavalu)లో వీఆర్వో (VRO)గా పనిచేస్తున్న ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో గా పనిచేస్తున్న పార్ల వెంకటరావు దారుణానికి పాల్పడ్డారు. విజయనగరానికి (Vizianagaram) చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు నిడదవోలు పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.. అనంతరం కేసు విషయంలో బాలికను విచారించగా.. డబ్బులు ఎరగా చూపి వ్యభిచార కూపంలోకి దింపినట్లు తెలింది.
నిడదవోలుకు చెందిన షేక్ అఖిలాండేశ్వరి, బండారి లలిత, దాడిశెట్టి దుర్గారావు అనే వీరు ఈ పాపానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మైనర్ బాలికపై పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో పార్ల వెంకటరావు.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిని డబ్బులు అడగగా ఇవ్వని కారణంగా నిడదవోలు వీఆర్వో పై దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి కొట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఈమేరకు మైనర్ బాలికను వ్యభిచారం కూపంలోకి దింపిన ముగ్గురు సభ్యులను, అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు విఆర్వోలపై Cr. No: 52/2024, IPC SEC 366 A, 370 A, 376 D R/W 34, 5 & 6 R/W 17/ ఫోక్సో యాక్ట్, 5/ITP యాక్ట్ కేసులు పోలీసులు నమోదు చేశారు. అదేవిధంగా వీఆర్వో పై దాడి చేసిన దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమందిపై IPC SEC 341, 323, 506 R/W 34 కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. కాగా డీఎస్పీ స్థాయి అధికారులు ఈ కేసు విచారణ చేపడుతున్నట్టు పోలీసులు అధికారులు వెల్లడించారు.