Telugu News » న‌ష్ట ప‌రిహారం చెల్లించాలి!

న‌ష్ట ప‌రిహారం చెల్లించాలి!

ప్ర‌భుత్వానికి ఈట‌ల సూచ‌న‌లు

by admin
bjp-mla-etela-rajender-key-press-meet-on-telangana-assembly-session-2023

అసెంబ్లీలో వరదలపై జ‌రిగిన‌ చర్చలో ప‌లు సూచనలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. భూగర్భ జలాలు పెరగడం కోసం చెక్ డామ్ లు కట్టుకున్నామ‌ని.. ఒక్కో దగ్గర 6 నుంచి 7 ఫీట్లు ఎత్తులో కట్టార‌న్నారు. వాటి దగ్గర ఇసుక పేరుకుపోవడం.. వరద వచ్చినప్పుడు చుట్టూ ఉన్న పొలాలు మునిగిపోవ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. అవి కట్టినప్పుడు జరిగే ఇబ్బందులు ఊహించలేద‌ని అన్నారు. వ‌ర‌ద‌ల‌తో ఇప్పుడు అర్థం అయ్యింది కాబట్టి వాటిని సరి చేసే పనులు చేపట్టాలని కోరారు.

bjp-mla-etela-rajender-key-press-meet-on-telangana-assembly-session-2023

వరదల‌ వల్ల పశువులు కొట్టుకుపోయి చనిపోయాయన్న ఈట‌ల‌.. ఒక్కో గేదె లక్ష రూపాయల విలువ ఉంటుంద‌ని తెలిపారు. కాబట్టి పశువులు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇళ్ళు కూలిపోయిన వారికి 5 లక్షల రూపాయలు, పాక్షికంగా ఇళ్ళు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆసరాగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.

వరదల వల్ల షాపుల నిర్వాహ‌కులు కూడా నష్టపోయార‌ని.. కట్టబట్టలతో రోడ్డుమీద ఉన్నార‌న్నారు రాజేంద‌ర్. వారు రోడ్డు మీద పడకుండా ఉండాలి అంటే నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. ఇసుక మేట వేసిన, కోతకు గురి అయిన పొలాలను బాగు చేసుకోవడనికి ప్రభుత్వమే డబ్బులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం పాజిటివ్ గా ఆలోచన చేసి నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్.

You may also like

Leave a Comment