ఐదు రాష్ట్రాల (Five States) ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో ఈసీ (EC) కీలక నిర్ణయం తీసుకొన్నది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును ( Money) బ్యాంకు (Banks)ల్లో డిపాజిట్ (Deposit) చేయడానికి, ఐటీ (IT) శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి ఈ-ఎస్‌ఎంఎస్ (E-SMS) అనే యాప్‌ను వినియోగించాలని ఈసీ భావిస్తున్నది.
అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్ (C-Vigil) యాప్స్‌ను ప్రవేశపెట్టింది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, మత్తు పదార్థాల వివరాలను నమోదు చేయకపోవడం వల్ల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపద్యంలో ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలను ఈఎస్‌ఎంఎస్ యాప్‌లో పొందుపర్చాలని అధికారులు నిర్ణయించారు.
అదీగాక ఎన్నికల్లో జరిగే అక్రమాలను, కోడ్‌ను ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, కులమతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈసీ తెలిపింది.
కాగా ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఫిర్యాదులు చేయవచ్చని, కంప్లైంట్ అందిన పది నిమిషాల్లో సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారని ఎన్నికల కమిషన్ తెలిపింది.