Telugu News » Egg Price: ‘ఎగ్’బాకింది.. కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు..!

Egg Price: ‘ఎగ్’బాకింది.. కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు..!

కోడిగుడ్డు ధర(Egg prices) ఆకాశానికి నిచ్చెనవేసింది. గుడ్డు ధర రోజురోజుకూ అమాంతం పెరుగుతోంది. ధరలు చూస్తే.. సామాన్యుడి గుండె గుబేలుమనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా కోడిగుడ్ల ధరలు ఎగబాకాయి. గతంలో రూ.4కే దొరికే కోడిగుడ్డు.. ఇప్పుడు రూ.7కు చేరింది.

by Mano
Egg Price: 'Egg' is good.. the egg sitting on the hill..!

ఓ వైపు కూరగాయల ధరలు(Vegetables prices) కుతకుతమంటుండగా.. మరో వైపు కోడిగుడ్డు ధర(Egg prices) ఆకాశానికి నిచ్చెనవేసింది. గుడ్డు ధర రోజురోజుకూ అమాంతం పెరుగుతోంది. ధరలు చూస్తే.. సామాన్యుడి గుండె గుబేలుమనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా కోడిగుడ్ల ధరలు ఎగబాకాయి. గతంలో రూ.4కే దొరికే కోడిగుడ్డు.. ఇప్పుడు రూ.7కు చేరింది.

Egg Price: 'Egg' is good.. the egg sitting on the hill..!

విశాఖలో కోడిగుడ్ల ధర ఆల్‌టైమ్ రికార్డు కొట్టింది. నిన్నటి వరకు కార్తీక మాసంతో.. నాన్‌వెజ్‌తో పాటు గుడ్లకు కూడా కొంతమంది దూరంగా ఉంటూవచ్చారు.. అయితే, కార్తీకమాసం ముగింపు, క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్‌తో గుడ్డు ధర పైపైకి ఎగబాకుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7కు పెరిగింది.

రిటైల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డును రూ.7కు విక్రయిస్తున్నారు వ్యాపారులు. ఇక, టోకుగా 100 గుడ్లు ధర 580 రూపాయలుగా ఉంది.. అంటే హోల్ సెల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.5.80 పలుకుతుండగా.. అదే రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి సరాసరి రూ.1.20 పెంచేసి.. రూ.7కు విక్రయాలు సాగిస్తున్నారు. స్థానికంగానే కాకుండా.. పశ్చిమ బెంగాల్, నార్త్ ఇండియా నుంచి కూడా కోడి గుడ్లకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

అయితే, ఉడికించిన గుడ్లు తినడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6గ్రాముల ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. అయితే, పెరిగిన ధరలతో సామాన్యులు సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది.

You may also like

Leave a Comment