కర్ణాటక (Karnataka)లోని బందీపూర్ నేషనల్ పార్క్(Bandipur National Park)లో ఇద్దరు టూరిస్ట్‌లకు (tourists) ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పెద్ద ఏనుగు (Elephant) వారిని వెంబడించింది. ప్రాణభయంతో వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చివరికి వారు ఏనుగు దాడి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు టూరిస్ట్‌లు కర్ణాటక నుంచి బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్(Tiger Reserve) మీదుగా కేరళకు వెళ్తున్నారు. దారి మధ్యలో వారికి ఓ పెద్ద ఏనుగు కనిపించింది.
ఆ ఏనుగుతో వారు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఏనుగు ఆ ఇద్దరినీ తరిమింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ఆ ఇద్దరు వ్యక్తులూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. చివరికి ఓ వ్యక్తి కిందపడిపోవడంతో ఏనుగు కాలితో తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనలో సదరు వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, సాధారణంగా జంతువుల స్వభావాన్ని బట్టి మనుషులు పరిగెత్తితే వెంబడిస్తుంటాయి. నిలకడగా ఒకేచోట నిలబడి ఉంటే ఏ హానీ తలపెట్టవని నిపుణులు అంటున్నారు.
2 tourists were confronted by an elephant While traveling from #Karnataka to #Kerala through #Bandipur National Park & Tiger Reserve. #Elephant became aggressive when the tourists attempted to take a #selfie, chased them but fortunately, both managed to narrowly escape unharmed. pic.twitter.com/1uIzW7ITiY
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 1, 2024