Telugu News » Elon Musk: అక్కడ భారత్‌కు సభ్యత్వం లేకపోవడం దారుణం: ఎలాన్‌ మస్క్

Elon Musk: అక్కడ భారత్‌కు సభ్యత్వం లేకపోవడం దారుణం: ఎలాన్‌ మస్క్

ఐక్యరాజ్యసమితి(United Nation Organization) పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) అసహనం వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో భారత్‌(Bharath)కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం దారుణమన్నారు.

by Mano
Elon Musk: 'Rockets should be sent into space not on the country..' Musk's interesting post..!

ఐక్యరాజ్యసమితి(United Nation Organization) పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) అసహనం వ్యక్తం చేశారు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో భారత్‌(Bharath)కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం దారుణమన్నారు.

Elon Musk: India's lack of membership is a shame: Elon Musk

శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ టెస్లా చీఫ్ మాస్క్ విమర్శలు గుప్పించారు. అయితే, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇటీవల ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేస్తూ భద్రతా మండలిలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

గత 80 ఏళ్ల కిందటిలా ఇప్పటికీ కొనసాగకూడదన్నారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైంది. అదేవిధంగా అమెరికాకు చెందిన వ్యాపారి మైఖెల్ ఐసెస్ బర్డ్ ఈ పోస్ట్‌కు సమాధానమిస్తూ మరి.. భారత్ సంగతి ఏంటి? అని ప్రశ్నించారు.

దీనికి ఎలాన్ మాస్క్ స్పందిస్తూ ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదిలి పెట్టేందుకు ముందుకు రాకపోవడం వల్లే అసలు సమస్య వస్తుందన్నాడు.. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మాస్క్ చెప్పుకొచ్చాడు.

ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ జరగలేదు. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నిస్తున్నప్పటికీ చైనా అడ్డు తగులుతోంది.

You may also like

Leave a Comment