Telugu News » EPFO Interest Rate: ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు.. 6కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి..!

EPFO Interest Rate: ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు.. 6కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి..!

2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీరేటును నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో (EPFO) వర్గాలు ప్రకటించాయి.

by Mano
EPFO Interest Rate: Increase in EPF interest rate.. Benefit for 6 crore employees..!

ఉద్యోగుల భవిష్య నిధి(EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీరేటును నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో (EPFO) వర్గాలు ప్రకటించాయి.

EPFO Interest Rate: Increase in EPF interest rate.. Benefit for 6 crore employees..!

ఈ వడ్డీ రేటు గత మూడేళ్లతో పోల్చుకుంటే ఇదే అత్యధికం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. అంతకు ముందు 2021-22లో 8.10శాతం వడ్డీ చెల్లించారు. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ(Central Finance Department) త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.

గత పదేళ్లలో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 8.75శాతం, 2015-16 8.8శాతంగా ఉంది. అదేవిధంగా 2016-17లో 8.65 శాతం ఉండగా 2017-18లో 8.55శాతం 2018-19లో 8.65శాతం వడ్డీ రేటు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం 2020-21లో 8.5శాతం, 2021-22లో 8.1శాతం, 2022-23లో 8.15 శాతంగా ఉంది.

You may also like

Leave a Comment