సినీ ఇండస్ట్రీ(Film industry)లో ఈ మధ్య విడాకుల అంశం సర్వసాధారణమైపోయింది. తాజాగా మరో సెలెబ్రిటీ జంట విడిపోయింది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని పెద్ద కూతురు, హీరోయిన్.. ఈషా డియోల్(Esha Deol) తన 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.
పరస్పరం అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. “భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా మా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే, విడాకులకు గల అసలు కారణాన్ని మాత్రం ఈషా డియోల్ వెల్లడించలేదు.
ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఈషా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే 2012లో భరత్ తక్తానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లైంది. గతేడాది వరకు భర్తతో అన్యోన్యంగా కనిపించిన ఈషా గత సంవత్సరంలో తమ పెళ్లి రోజు భర్తతో సన్నిహితంగా ఉన్న ఫొటోనూ కూడా షేర్ చేసింది. కానీ అదే చివరి పోస్ట్ కావడం గమనార్హం.
బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర-హేమమాలిని పెద్ద కుతురు ఈషా డియోల్. తల్లిదండ్రుల నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అతి చిన్న వయసులోనే ఈమె ఇండస్రీలోకి అడుగుపెట్టింది. అన్ని భాషల్లో కలిపి 30కి పైగా చిత్రాల్లో నటించింది. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘యువ’ సినిమాలో సూర్య సరసన నటించి సౌత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.