Telugu News » Zaheer Khan: భారత్ బ్యాటింగ్ మెరుగుపడాలి: మాజీ ప్లేయర్

Zaheer Khan: భారత్ బ్యాటింగ్ మెరుగుపడాలి: మాజీ ప్లేయర్

టీమ్ ఇండియా(Team India) బ్యాటింగ్(Batting) ఇంకా మెరుగుపడాల్సి ఉందని మాజీ ప్లేయర్ జహీర్‌ఖాన్(Zaheer Khan) అభిప్రాయపడ్డాడు. టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశాడు.

by Mano
Zaheer Khan: India's batting needs to improve: Former player

టీమ్ ఇండియా(Team India) బ్యాటింగ్(Batting) ఇంకా మెరుగుపడాల్సి ఉందని మాజీ ప్లేయర్ జహీర్‌ఖాన్(Zaheer Khan) అభిప్రాయపడ్డాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal), శుభ్‌మన్ గిల్(Shubman Gill) సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని తెలిపాడు. మిగతా టెస్టుల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.

Zaheer Khan: India's batting needs to improve: Former player

టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని జహీర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరును జహీర్ విశ్లేషించాడు. ‘సిరీస్‌లో ఒక మ్యాచ్ ఓడి వెనుకంజలో ఉన్నపుడు 1-1తో సమం చేయాలనే కసి, దూకుడు ఆటగాళ్లలో కనిపించాలన్నాడు. ప్రతీఒక్కరిలో ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్ కృషి చేశాడని తెలిపాడు.

అయితే మన బ్యాటింగ్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉందని, ఇలాంటి మైదానాలపై భారత బ్యాటర్లు ఇంతకంటే గొప్పగా బ్యాటింగ్ చేశారు. నిజానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసిందంటూ జహీర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లు 1-1తో సమం చేసింది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన విశాఖలో బదులు తీర్చుకుంది.

ఇక మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సి ఉంది. మరోవైపు భారత జట్టు బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ చూస్తే ఒకే అర్ధ సెంచరీ నమోదైంది. అయినా 300కు దగ్గరగా స్కోరు చేసింది. రెండో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ (209) చేయగా.. గిల్ సెంచరీ (104) చేశాడు.

You may also like

Leave a Comment