Telugu News » etala rajendar: ఈసారి రాబోయేది బీజేపీనే: ఈటల రాజేందర్‌!

etala rajendar: ఈసారి రాబోయేది బీజేపీనే: ఈటల రాజేందర్‌!

కనీ వినీ ఎరుగని రీతిలో బీజేపీకి స్పందన ఉందని పేర్కొన్నారు.

by Sai
etala rajendar fires on brs

తెలంగాణలో ఈ సారి కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఈటల రాజేందర్‌(etala rajendar) ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం ఖమ్మం(khammam)లో జరగబోయే అమిత్‌ (amith shah) భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గోవా వాస్కోడిగామా ఎమ్మెల్యే కృష్ణ సాల్కర్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

etala rajendar fires on brs

ఇప్పుడున్న బీఆర్‌ఎస్‌(brs) ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వారు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం అమిత్ షా గారి మీటింగ్ ఖమ్మం డిగ్రీ కాలేజీలో జరగబోతుందని తెలిపారు. మహబూబ్ బాద్ లో కనీ వినీ ఎరుగని రీతిలో బీజేపీకి స్పందన ఉందని పేర్కొన్నారు.ఇప్పటికే ఆ జిల్లాకు 163 బస్ లు పంపాము. ఇంకా 40 బస్ లు డిమాండ్ ఉందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంత స్పందన ఉందని వివరించారు. కేసీఆర్‌ చెప్తున్న మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో డబ్బు బలం, అధికార బలంతో మీడియా మేనేజ్ మెంట్ ని బెదిరించి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారని విమర్శించారు.

కేసీఆర్‌ కి ఈసారి ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి ప్రజలకు నాయకత్వం వహించడానికి బీజేపీ ముందుకు వచ్చిందన్నారు. అందులో భాగమే అమిత షా మీటింగ్ అని తెలిపారు. అతి త్వరలోనే రాష్ట్రంలో నడ్డా, మోడీ మీటింగ్లు కూడా ఉంటాయని వివరించారు. మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.

” డబుల్ బెడ్ రూం ఇల్లు, 57 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇచ్చిన రుణమాఫీ డబ్బులు వడ్డీకి సరిపోవడం లేదు. వచ్చే ఎన్నికల్లోకేసీఆర్‌ కి బుద్ది చెప్పే పార్టీ బీజేపీ. ఆ సత్తా ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటే. రెండు సీట్ల నుండి 303 సీట్లు ఎదిగిన పార్టీ. తెలంగాణలో 42 ఏళ్లుగా బీజేపీ అనేక త్యాగాలు చేసింది. గత కొద్ది రోజులుగా ఏ ఎన్నిక జరిగిన గెలుస్తున్న పార్టీ బీజేపీ. కాంగ్రెస్ లో 19 మంది గెలిస్తే 12 మంది బీఆర్‌ఎస్‌ లో చేరారు. కొద్ది రోజుల క్రితం కూడా ఓ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుక్కల్లెక్క మోరుగకుండా ఉండాలంటే ఇందులో పడేస్తే చాలు అని వారిని చేర్చుకున్నాం అన్నారు అంటే.,బీఆర్‌ఎస్‌లో చేరిన వారు అలోచన చేసుకోవాలని” అని ఈటల అన్నారు.

కాంగ్రెస్‌ ను గెలిపించుకుంటే మళ్లీ పోరు అనే నమ్మకం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఒక్కటే కేసీఆర్‌ ను సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. కాంగ్రెస్‌ కి మీడియా హైప్‌ తప్ప ప్రజల్లో ఎలాంటి బలం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు, దందాలు పెరిగాయి అని కేసీఆర్‌ స్వయంగా వీళ్లకు ఓటు పడవు పద్దతి మార్చుకోండి అని చెప్పారు. కానీ ఎందుకు అందరికీ ఇచ్చారు అంటే.. వేరే పార్టీ లోకి పోతారు అని భయపడి వాళ్ళను కంట్రోల్ లో పెట్టుకోడానికి ఇచ్చారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సమన్యాయంతో ముందుకు సాగుతుంది:
11 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా జాతిని కేసీఆర్‌ అవమానించారని ఈటల ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు లేకుంటే ఎస్సీ, ఎస్టీ సీట్లు కూడా వారే తీసుకొనే వారని ఎద్దేవా చేశారు. బీసీలు 52 % ఉంటే 23 సీట్లు ఇచ్చారు. ముదిరాజ్, కురుమ, నాయిబ్రహ్మన, రజక, కుమ్మర, ఎంబీసీ లకు ఒక్క సీటు లేదని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ కూడా బీసీలకు, ఓబీసీలకు వ్యతిరేకమైన పార్టీ అని అన్నారు. దేశానికి మొదటిసారి ఓబీసీ ప్రధాని అయ్యారని గర్వంగా చెప్పారు. భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచపటం మీద సగర్వంగా నిలబెడుతూ పాలిస్తున్నారని కొనియాడారు. స్కాంలు లేకుండా సుస్థిరంగా పాలిస్తున్నారని తెలిపారు.

”మూడున్నర కోట్ల ఇల్లు కట్టించారు. చేతి వృత్తులు వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక గుంట భూమి ఉన్నా ఆరువేల రూపాయలు ఇస్తున్నారు. ఆకలి తెలిసిన బిడ్డ కాబట్టి పేదలకు కావాల్సిన పథకాలు తీసుకువచ్చారు. దొర బిడ్డ కేసీఆర్‌ కి పేదల బాధలు ఎలా తెలుస్తాయి. ఇల్లు లేని బాధ ఆయనకు ఎలా తెలుస్తుంది. బలహీన వర్గాలకు బీజేపీ న్యాయం చేస్తుంది. పేదల ఎజెండాగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో అధికారం లక్షంగా పనిచేస్తున్నాం. మా బండి సంజయ్ గారు మూడు సంవత్సరాలు అధ్యక్షునిగా పని చేశారు.ఎఫెక్టివ్ గా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు. అర్థాంతరంగా తీసివేశారు అనేది గిట్టని వాళ్ళు, తెలియని వాళ్ళు చేసే ప్రచారం. బీఆర్‌ఎస్‌ లాగా జీవితాంతం ఒకరే అధ్యక్షులు ఉండరు. చచ్చిపోయే దాకా అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి వారి కుటుంబం నుండి ఉంటారు. కాంగ్రెస్ కూడా ఒక పార్టీ కుటుంబ పార్టీనే.టికెట్ కసరత్తు చేస్తున్నాం” మని ఆయన తెలిపారు.

You may also like

Leave a Comment