Telugu News » Etala Rajendar: రాష్ట్రంలో నిజాం తరహా పాలన సాగుతోంది: ఈటల రాజేందర్!

Etala Rajendar: రాష్ట్రంలో నిజాం తరహా పాలన సాగుతోంది: ఈటల రాజేందర్!

నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

by Sai
etela rajendar sensational comments on brs

బీజేపీ(BJP) కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajendar) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy)24 గంటల నిరాహార దీక్షకు ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా యావత్ తెలంగాణ జాతి కదిలిందన్నారు.

etela rajendar sensational comments on brs

తెలంగాణ శ్రేయస్సు కోరి జయశంకర్ లాంటి వారు తెలంగాణ స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారన్నారు. విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు ప్రాణాలు తెగించి పోరాడారని అన్నారు. ఆనాటి ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా, తెలంగాణ ద్రోహుల కుట్రలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారని తెలిపారు. తమ చావుతోనైనా తెలంగాణ పురోగమించాలని ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి నుంచి మొదలు యాదిరెడ్డి లాంటివారు అనేకమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని అన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చెసుకోవద్దని అన్నారు.తెలంగాణ చూడడానికి బ్రతికుండాలి అని సుష్మా స్వరాజ్ భరోసా కల్పించారని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ తో బీజేపీ పోరాడుతోందని, ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో ఇబ్బందులకు ఓర్చి కోచింగులు తీసుకొని చదువుకుంటుంటే.. వాళ్ల ఆశలపై నీళ్ల చల్లుతున్నారుని అన్నారు.

2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ. 3016 ఇస్తానని మాటతప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణొస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ.. 17 ఎగ్జామ్స్ పేపర్లను లీక్ చేసి చదువుకుంటే ఉద్యోగాలు రావంటూ కేసీఆర్ యువతకు విషాదాన్ని మిగిల్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీకారులకే ఉద్యోగాలంటూ సందేశం ఇచ్చిండని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ అనుమతి తీసుకొని ఇందిరాపార్క్ వేదికగా బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపడితే బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని మండిప్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తోంది. కేంద్రమంత్రి అని కూడా చూడకుండా కిషన్ రెడ్డి గారిపై జుగుప్సాకరంగా ప్రవర్తించారని అన్నారు.

బీజేపీకి పోరాటాలు, కేసులు కొత్త కాదు.. ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ మొత్తం ఒక పోలీసు వలయంగా మారింది. అనేక పోరాటాల్లో భాగంగా బీజేవైఎం కార్యకర్తలను, బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ రిక్రూట్ మెంట్ జరగలే.. కాని, పోలీసు రిక్రూట్ మెంట్ జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కాని ఆత్మగౌరవాన్ని కోల్పోరని, అన్యాయం జరిగితే బరిగీసి కొట్లాడుతారని అన్నారు.

అంగన్ వాడీ టీచర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తే వీఏలను పురిగొల్పి కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో సమ్మె చేసిన ప్రతి సంఘం కన్నీళ్లు పెట్టుకుంది తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. కేసీఆర్ రాజ్యంలో సచివాలయానికి ఎమ్మెల్యేలకు, మీడియాకు, సంఘాలకు ఎంట్రీ లేదు.

నిజాం తరహా పాలన నడుస్తోందని అన్నారు. బీజేపీ కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ దుర్మార్గ సర్కారు కాలగర్భంలో కలవక తప్పదని అన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే రైతులు, ప్రజల నుంచి 3 వేల ఎకరాల పైచిలుకు భూములను అక్రమంగా లాక్కున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

You may also like

Leave a Comment