ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధానికి దిగిన రష్యా(Russia)కు సాయం చేస్తున్నట్లు చైనాకు చెందిన మూడు కంపెనీలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు ఆ మూడు కంపెనీలతో పాటు మరో డజన్ కంపెనీలపై యూరోపియన్ యూనియన్(European Union) వాణిజ్య ఆంక్షలను ప్రతిపాదించింది.
అయితే, టెక్నాలజీ-ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రష్యా సైనిక, సాంకేతిక వృద్ధికి, మాస్కో రక్షణ, భద్రతా రంగ అభివృద్ధికి దోహదపడుతున్నట్లు ఈయూ ఆరోపించింది. బ్లూమ్‌బెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో హాంకాంగ్, సెర్బియా, భారత్, టర్కీకి చెందిన ఒక్కొక్క కంపెనీలు ఉన్నాయి. అయితే, రష్యా సామర్థ్యాన్ని అణిచివేసేందుకు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలతో వ్యాపారం చేయకుండా యూరోపియన్ కంపెనీలను ఆంక్షలు నిషేధించాయి.
గతంలో ఈయూ అనేక చైనీస్ కంపెనీలను బ్లాక్ లిస్టు జాబితా చేయాలని ప్రతిపాదించింది. అయితే కొన్ని సభ్య దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు కుదరలేదు. కాగా, జర్మనీకి, వోక్స్‌వ్యాగన్ ఏజీతో సహా కార్ల తయారీదారులకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈయూ ఆంక్షలకు అన్ని సభ్య దేశాల మద్దతు అవసరమైంది.
అయితే, ఈ ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు కమిషన్ ప్రతినిధి నిరాకరించారు. ఈయూ ఆంక్షలతో చైనాతో యూరప్ దేశాల వ్యాపారం రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టింది. కానీ పెరుగుతున్న చైనా ఎగుమతుల కారణంగా ఇది తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశముంది. అయితే, రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సైనిక సామగ్రిని అందించకూడదని వాన్ డెర్ లేయన్ అన్నారు.