మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Malla reddy) భూ కబ్జా ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్ (Shameerpet)లో నమోదైన కేసును క్వాష్ చేయాలని మల్లారెడ్డి హైకోర్టును (HighCourt) కోరారు. కాగా మేడ్చల్ (Medchal)జిల్లా కేశవరం గ్రామంలో మాజీ మంత్రి భూకబ్జా (land occupation)కి పాల్పడ్డట్టు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో తనపై అక్రమంగా నమోదైన కేసును కొట్టివేయాలని మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ కె. సురేందర్ ముందు విచారణకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధుల కేసును విచారిస్తున్న ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇక మల్లారెడ్డి పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగనుంది.
మరోవైపు గత వారం క్రితం మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా, మూడు చింతలపల్లి మండలం, కేశవరం గ్రామంలో లంబాడీలకు చెందిన సర్వే నంబర్ 33, 34, 35లో 47 ఎకరాల 18 గుంటల భూమిని, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన 9 మంది అనుచరులు కుట్రతో మోసం చేసి అక్రమంగా ఆక్రమించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే భూ కబ్జా కేసులో తనను రాజకీయ కక్ష సాధింపుతోనే ఇరికించారని మాజీమంత్రి ఆరోపిస్తున్నారు.