తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ (TDP)మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (kasani Gnaneshwar) ముదిరాజ్ (Mudiraj) బీఆర్ఎస్ (BRS)పార్టీలో చేరారు. ఇన్నాళ్ళూ తెలంగాణలో పట్టు లేని టీడీపీకి బలమైన నాయకునిగా ఉన్న కాసాని అనివార్య పరిస్థితుల వల్ల టీడీపీని వదిలి కారెక్కారు. ఈ క్రమంలో ఎర్రవల్లి సీఎం ఫామ్ హౌస్‌లో సీఎం కేసీఆర్ కాసానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఈటల పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన ఈటల కంటే కాసాని పెద్దమనిషని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముదిరాజ్‌లను ఈటల ఎదగనివ్వలేదని.. నామినేటేట్ పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్ద పీట వేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముదిరాజ్‌లతో ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తానని తెలిపిన కేసీఆర్..ఎన్నికల తర్వాత కలుద్దామని వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ టీడీపీ చీఫ్‌గా కాసాని ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకోవడంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనై టీడీపీకి బైబై చెప్పి కారెక్కారు.. మరి ఇక్కడైన కాసాని జ్ఞానేశ్వర్ కల నెరవేరుతుందా.. ముదిరాజ్ లకి న్యాయం జరుగుతుందా వేచి చూడాలని అనుకుంటున్నారు..