Telugu News » Hyderabad Crime:  ‘ఎక్స్ ట్రా పెరుగు హోటల్’ మూసివేతకు ఆదేశాలు

Hyderabad Crime:  ‘ఎక్స్ ట్రా పెరుగు హోటల్’ మూసివేతకు ఆదేశాలు

మెరిడియన్ రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసి వేయాలని, తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్ స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.  

by Prasanna
CP Anand

బిర్యానీ తినేందుకని మెరిడియన్ హోటల్ (Hotel) కు వెళ్లిన ఓ వ్యక్తి… ఎక్స్ ట్రా పెరుగు (Extra Curd) తీసుకు రమ్మని సిబ్బందిని అడిగాడు. అప్పుడు హోటల్ సిబ్బంది (Hotel Staff) పెరుగు అడిగిన వ్యక్తిపై దాడి చేయగా, అతడు చనిపోయాడు.

CP Anand

ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. మెరిడియన్ రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసి వేయాలని, తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్ స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.

curd and biryani

‘ఎక్స్ ట్రా పెరుగు మర్డర్’ కేసులో అసలేం జరిగింది…?

చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ అనే వ్యక్తి.. సోమవారం రోజు బిర్యానీ తినేందుకు స్థానికంగా ఉన్న హోటల్ కు వెళ్లాడు. అక్కడే బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాడు. అయితే తనకు పెరుగు చాలకపోవడంతో.. ఎక్స్ ట్రా పెరుగు కావాలని సిబ్బందిని కోరాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు స్పాట్ కు వచ్చి హోటల్ సిబ్బంది, లియాకత్ లను స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. ఇంతలోనే లియాకత్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే లియాకత్ ను స్థానిక డెక్కన్ హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. లియాకత్ మృతి చెందాడు.

ఆ తర్వాత లియాకత్ పై దాడికి పాల్పడిన సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హోటల్ ను తాత్కలికంగా మూసివేయాలని సీపీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

You may also like

Leave a Comment