Telugu News » Fans Phones: అభిమాన హీరో బర్త్‌డే.. 30 సెల్‌ఫోన్లు చోరీ..!

Fans Phones: అభిమాన హీరో బర్త్‌డే.. 30 సెల్‌ఫోన్లు చోరీ..!

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్ ఖాన్ జన్మదిన వేడుకలు నవంబర్ 2న అభిమానులు ఘనంగా జరిపారు. ఆయన ఇంటి ‘మన్నత్’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి.

by Mano
sharuk

అభిమాన హీరో బర్త్‌డే వచ్చిందంటే ఫ్యాన్స్‌ సందడి మామూలుగా ఉండదు. అయితే జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు హీరో ఇంటికి వెళ్లిన అభిమానులకు షాక్ తగిలింది. ఏకంగా 30మంది అభిమానుల సెల్‌ఫోన్‌లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

sharuk

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్ ఖాన్ జన్మదిన వేడుకలు నవంబర్ 2న అభిమానులు ఘనంగా జరిపారు. మామూలుగానే షారుఖ్ నివాసం మన్నత్ బయట ప్రతిరోజూ వందలాది అభిమానులు గుమికూడుతూ ఉంటారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఇంటి ‘మన్నత్’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి.

తన ఫోన్ చోరీకి గురైందని, ఈ సంఘటన రాత్రి 12:30 గంటలకు జరిగిందని ఒక జర్నలిస్ట్ ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో, కొంతమంది అభిమానులు విడివిడిగా వెళ్లి ఫిర్యాదు చేయగా, 17 మంది అభిమానులు దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద 30 ఫోన్లు దొంగతనం జరిగినట్లు తేలింది.

నవంబర్ 3న కేసు నమోదు చేసుకుని తర్వాత బాంద్రా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఘటనా స్థలం, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాంద్రా పోలీసులు శుభం జమ్ ప్రసాద్, మహమ్మద్ అలీ, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు.

You may also like

Leave a Comment