హైదరాబాద్ (Hyderabad)లో రెండు వేరు వేరు చోట్ల జరిగిన అగ్ని ప్రమాదాలు (Fire Accident) నగర ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. గోశామహల్ (Gosamahal) రాజేంద్రనగర్ (Rajendranagar)లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోయిన.. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఆ వివరాలు చూస్తే.. రాజేంద్ర నగర్ లోని సన్ సిటీ వద్ద తెల్లవారు జామున 3:15 నిమిషాలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్స్ తో అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళడం జరిగింది.. 3 గంటల పాటు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. మరోవైపు ప్రమాదానికి కారణం క్రాకర్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల మంటలు వ్యాపించాయని తెలిపారు..
ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ ఫుడ్ కోర్టులో సిలిండర్ బ్లాస్ట్ అయిందని తెలిపారు. ఇలా ఆ మంటలు ఫుడ్ కోర్టు, హోటల్, పాన్ షాప్,టెన్ట్ హౌస్ గోదాం, మెడికల్ షాప్ , ఆ షాప్ గోదాంలోకి వ్యాపించాయని అన్నారు.. కాగా అగ్నికి 5 దుకాణాలు ఆహుతి అయ్యాయని వెల్లడించారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ లు, రాజేంద్రనగర్ పోలీసులు టైంకి రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. అదృష్ట వశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.
మరోవైపు రాజేంద్రలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కూడా క్రాకర్స్ దుకాణం వల్ల జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల పలు షాపులు మంటల్లో కాలిపోయాయన్నారు.. ఆ షాప్ యజమానులు మాట్లాడుతూ.. లక్షల్లో అస్తి నష్టం జరిగిందని తెలిపారు.. క్రాకర్స్ బిజినెస్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు ఇల్లీగల్ క్రాకర్స్ దుకాణాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.. కాగా ఈ మధ్యకాలంలో నగరాన్ని అగ్నిప్రమాదాలు వణికిస్తున్న విషయం తెలిసిందే..