Telugu News » Fire Accident : మక్తల్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 25 లక్షల ఆస్తి నష్టం..!

Fire Accident : మక్తల్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 25 లక్షల ఆస్తి నష్టం..!

వీరి నిర్లక్ష్యం వల్ల నష్టం భారీగా పెరిగిందని దుకాణం యజమాని రాజారెడ్డి ఆరోపిస్తున్నారు. అరగంట తర్వాత పైర్ అధికారులు వచ్చి మంటలు పక్కకు వ్యాపించకుండా చర్యలు తీసుకొన్నారని తెలిపారు.

by Venu
Fire Accident: Huge fire in Hyderabad.. Smoke spread for kilometers..!

అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.. ఎక్కవ ఒకచోట ఇలాంటి ప్రమాదాలు సంభవించిన వార్తలు రావడం తెలిసిందే.. ప్రస్తుతం ఇలాంటి ఘటన మక్తల్ (Maktal) పట్టణ కేంద్రంలో చోటుచేసుకొంది. పోలీస్ స్టేషన్‌ (Police station)కు కూతవేట్టి దూరంలో బస్టాండ్ ప్రధాన రహదారిపై నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిందని సమాచారం..

స్థానికంగా ఉన్న అభి మెన్స్‌వేర్ బట్టల దుకాణంలో ఎగిసిపడిన మంటల వల్ల విలువైన డ్రెస్సులు కాలి బూడిదయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రమాద సమాచారం గురించి పైర్ అధికారులకు తెలిపినా.. వారు సమయానికి రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు మైనార్టీ యువకులు దుకాణం కాలిపోతుందన్న విషయాన్ని చెప్పేందుకు ఫైర్ స్టేషన్‌కు వెళ్లి తలుపులు తట్టి లేపేంత వరకు ఫైర్ అధికార్లు అందుబాటులోకి రాలేదని అంటున్నారు..

వీరి నిర్లక్ష్యం వల్ల నష్టం భారీగా పెరిగిందని దుకాణం యజమాని రాజారెడ్డి ఆరోపిస్తున్నారు. అరగంట తర్వాత పైర్ అధికారులు వచ్చి మంటలు పక్కకు వ్యాపించకుండా చర్యలు తీసుకొన్నారని తెలిపారు. పక్కన ఉన్న దుకాణానికి మంటలు వ్యాపించి ఉంటే మరింత ఆస్థి నష్టం జరిగేదాని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు..

రంజాన్ (Ramadan) పండుగ వస్తున్నందున రెండు రోజుల కిందట దాదాపు రూ.10 లక్షల విలువైన దుస్తువులను తీసుకువచ్చినట్లు తెలిపారు. దుకాణంలో డ్రెస్సులు అన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయని వాపోయారు.. అయితే రాత్రి దుకాణం మూసేటప్పుడు లైట్లు అన్నీ ఆర్పేసి స్విచ్ ఆఫ్ చేశానని తెలిపిన యజమాని.. కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణంలో మంటలు వ్యాపించాయని.. షాపులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డ్ అయిందని వెల్లడించారు..

You may also like

Leave a Comment