Telugu News » fire accident train: భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలులో ప్రమాదం..ఐదుగురు సజీవ దహనం!

fire accident train: భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలులో ప్రమాదం..ఐదుగురు సజీవ దహనం!

మధురై రైల్వే స్టేషన్‌లో అగివున్న లక్నో-రామేశ్వరం రైలు కిచెన్‌లో సిలిండర్ పేలడం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

by Sai
fire accident in bhrat gourav tourist train

తమిళనాడు (tamilanadu) లోని మధురై (madhurai) లో రైలు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌(uttarapradesh) లోని లక్నో(lucknow) నుంచి రామేశ్వరం(rameswaram) వెళ్తున్న భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు( bharat gaurav tourist train)లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

fire accident in bhrat gourav tourist train

మదురై రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో రైలు నిలిచిపోయింది. టూరిస్ట్‌ రైలులో భక్తులు గ్యాస్ సిలిండర్ ఉపయోగించి వంట చేయడం వల్ల మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఒక కంపార్ట్‌మెంట్‌ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు మంటలు (fire) వ్యాపించాయి.

దీంతో ప్రయాణికులు కేకలు వేస్తూ రైలు నుంచి బయటకు వచ్చారు. అయితే మంటల్లో కొందరు ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6 గురు ప్రయాణికులు మరణించినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఒకరు మహిళ గా గుర్తించారు.

వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన బోగిల్లో ఎగసిపడుతున్న మంటలు అదుపులోకి చేశారు. జిల్లా కలెక్టర్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. టూరిస్ట్ రైలులో సిలిండర్ పేలడం వల్లే మంటలు ఎగసిపడినట్లుగా ప్రాధమిక విచారణలో తేలింది.

మధురై రైల్వే స్టేషన్‌లో అగివున్న లక్నో-రామేశ్వరం రైలు కిచెన్‌లో సిలిండర్ పేలడం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో లోపల చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారు. మరొకరు మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్‌లో ఈ దుర్ఘటన జరగడంతో రైల్వే అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

You may also like

Leave a Comment