సికింద్రాబాద్ (Secunderabad), మారేడుపల్లి (Marredpally)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈరోజు మధ్యాహ్నం ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకోన్నాయి. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాగా షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మరోవైపు అగ్నిప్రమాదం (fire hazard) విషయం తెలుసుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు..
ఢిల్లీ (Delhi) శాస్త్రినగర్ లోని 4 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా దంపతులు కలిపి మొత్తం నలుగురు మృతి చెందినట్లు సమాచారం. షాదారా వద్ద ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 5.20 గంటలకు తమకు ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు వారు వివరించారు.