Telugu News » Secunderabad : సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో అగ్నిప్రమాదం..!

Secunderabad : సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో అగ్నిప్రమాదం..!

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని పాలికబజార్ సెల్లారులో.. శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం (Fir Accident) జరిగినట్టు సమాచారం. మోండా మార్కెట్ లోని సిటీ కలెక్షన్ (City Collection) బ్యాగుల దుకాణం (Bag Store)లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. వేగంగా మంటలు షాపు మొత్తం వ్యాపించినట్టు సమాచారం..

by Venu

సికింద్రాబాద్ (Secunderabad)మోండా మార్కెట్ ( Monda Market) నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఏదైనా జరగరానిది జరిగితే ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. కానీ ముంచుకొచ్చే ప్రమాదాలను పసిగట్టలేక ఎన్నో సార్లు ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతుండటం కనిపిస్తూనే ఉంది.

కాగా తాజాగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని పాలికబజార్ సెల్లారులో.. శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం (Fir Accident) జరిగినట్టు సమాచారం. మోండా మార్కెట్ లోని సిటీ కలెక్షన్ (City Collection) బ్యాగుల దుకాణం (Bag Store)లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. వేగంగా మంటలు షాపు మొత్తం వ్యాపించినట్టు సమాచారం..

ఎగుసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు.. మంటలు చుట్టు పక్కల దుకాణాలకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.. కాగా ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

You may also like

Leave a Comment