Telugu News » Fish Meat: కృత్రిమంగా చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్..!

Fish Meat: కృత్రిమంగా చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్..!

చేప మాంసాన్ని(Fish Meat) కృత్రిమంగా తయారు చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) ఒక కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు ప్రకటించింది.

by Mano
Fish Meat: Artificial production of fish meat.. the first project in the country..!

భారత్‌(Bharath)లో తొలిసారి వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు శాస్త్రవేత్తలు. చేప మాంసాన్ని(Fish Meat) కృత్రిమంగా తయారు చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) ఒక కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ నీట్ మీట్‌ బయోటెక్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది.

Fish Meat: Artificial production of fish meat.. the first project in the country..!

ఈ మేరకు ఇరుసంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎంఎస్ఆర్ వివరించింది. సీఫుడ్‌కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరాను పెంచాడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాబ్‌లో ప్రాథమిక సౌకర్యాలతో సెల్ కల్చర్ లేబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

మరోవైపు సెల్ కల్చర్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న నీట్ మీట్, సెల్ గ్రోత్ మీడియా ఆప్టిమైజేషన్, సెల్ అటాచ్మెంట్ బయోరియాక్టర్ల ద్వారా ఉత్పత్తి లాంటి కార్యకలాపాలను చేపడుతున్నట్లు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చెప్పుకొచ్చింది. ఈ ప్రాజెక్టుతో సముద్రజీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించవచ్చని తెలిపింది.

చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో అభివృద్ధి చేసి చేప మాంసాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయని తెలిపింది. అయితే, తొలి దశలో కింగ్‌ఫిష్, చందువా చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తామని సీఎంఎస్ఆర్‌ఐ పేర్కొంది.

You may also like

Leave a Comment