మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్నారని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట
(Siddipet) జిల్లాలో కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీశ్ రావు.. నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కి దక్కుతుందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకి 6 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని దివ్యాంగుల పక్షాన ప్రభుత్వాన్ని హరీశ్ రావు కోరారు. దివ్యాంగులకు గత ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని హరీశ్ రావు అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా దివ్యాంగులకి 400, 700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదని హరీశ్ రావు గుర్తుచేశారు. మానసిక దివ్యాంగుల పట్ల కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు సరిగ్గా లేదని సూచించారు హరీష్ రావు..
అలాంటి వారు నా దృష్టిలో మనుషులే కాదని పేర్కొన్నారు. తన వంతు సాయంగా.. మానసిక దివ్యాంగుల అవసరాల కోసం జీతం నుంచి కొంత మొత్తాన్ని ఇస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిని (LV Prasad Hospital) ఏర్పాటు చేశామని తెలిపిన హరీష్ రావు.. కంటి సమస్యలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో అభయ జ్యోతి శాశ్వత భవన నిర్మాణానకి తన వంతు సహకారం అందజేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.