గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదుతో శామీర్పేట్ పోలీస్స్టేషన్లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయ్యింది.. అయితే ఈ కేసు విషయంపై మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) స్పందించారు. తాను భూకబ్జాకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. కబ్జా చేయవలసిన అవసరం తనకు లేదని ఈ సందర్భంగా వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కావని మల్లారెడ్డి వివరించారు.
భూ కబ్జా చేశానని కేసు నమోదైన విషయం వాస్తవమే అని తెలిపిన మల్లారెడ్డి.. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తానని చేశారు. మరోవైపు మల్లారెడ్డి.. మేడ్చల్ (Medchal) మల్కాజ్గిరి (Malkajiri)జిల్లా, మూడు చింతలపల్లి మండలం, కేశవరం (Kesavaram) గ్రామంలో గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాల భూమి కబ్జా చేశారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో నిన్నఆయనపై కేసు నమోదు కావడం దుమారం రేపింది..
ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే మల్లారెడ్డి పై భూకబ్జా కేసు నమోదు కావడం ఇదేమి కొత్త కాదు. గతంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా అవి నిజాలుగా బయటకి రాలేదనే టాక్.. మేడ్చల్ మల్కాజ్గిరి నియోజక వర్గంలో ఉంది.
మరోవైపు గిరిజనుల భూములకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లారెడ్డి ప్రకటించారు. కొందరు మధ్యవర్తులు చేసిన పని తనపై నిందపడేలా చేసిందని.. వారే గిరిజనులు భూమిని కబ్జా చేసి ఉంటారని మల్లన్న తెలిపారు.. అయినా మేడ్చల్ మల్కాజ్గిరి నియోజక వర్గ పరిధిలో మల్లన్న లీలలు తెలియని వారు ఉన్నారా? అని ఈ విషయం తెలిసిన కొందరు అనుకొంటున్నారు. కొత్త ప్రభుత్వం అయినా నిజాలు బయటికి తీస్తారా? అని ఎదురుచూస్తున్నారు.