Telugu News » Hyderabad : ముఖ్యమంత్రి కార్యాలయంలో మోసం.. సీఎంవో అధికారినంటూ..??

Hyderabad : ముఖ్యమంత్రి కార్యాలయంలో మోసం.. సీఎంవో అధికారినంటూ..??

మోసాగాడి పాపం పండి పోలీసుల చేతికి చిక్కాడు.. మంత్రుల లెటర్‌ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, భూ సమస్యలు పరిష్కరిస్తానంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. సీఎం (CM) ప్రొటోకాల్‌ నకిలీ స్టిక్కర్లను ప్రవీణ్‌ పలువురికి అందించినట్లు అభియోగాలున్నాయి.

by Venu

జనాన్ని మోసం చేయడంలో కేటుగాళ్లు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు.. అమాయక ప్రజల ఆశను అవకాశంగా తీసుకున్న మోసగాళ్ళు, లక్షలకు లక్షలు కొల్లగొడుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం.. తాజాగా ఇలాంటి మోసగాడు పోలీసుల వలలో పడ్డాడు.. హైదరాబాద్‌ (Hyderabad) వనస్థలిపురం (Vanasthalipuram) ప్రాంతానికి చెందిన అత్తిలి ప్రవీణ్‌సాయి ఏకంగా తాను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారినంటూ మోసాలకు పాల్పడుతుండటం సంచలనంగా మారింది.

మోసం ఎన్నాళ్ళని దాగుతుంది. ఈ క్రమంలో మోసాగాడి పాపం పండి పోలీసుల చేతికి చిక్కాడు.. మంత్రుల లెటర్‌ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, భూ సమస్యలు పరిష్కరిస్తానంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. సీఎం (CM) ప్రొటోకాల్‌ నకిలీ స్టిక్కర్లను ప్రవీణ్‌ పలువురికి అందించినట్లు అభియోగాలున్నాయి. ప్రస్తుతం నిందితుడు ప్రవీణ్‌ సాయి (Praveen Sai)..ఎల్బీ నగర్‌ (LB Nagar) ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ఉన్నాడు.

మరోవైపు నిందితుడి ఇన్నోవా కారు, సెల్‌ ఫోన్‌ కూడా పోలీసులు సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.. ఇక ఉద్యోగాలు రాక.. చదివిన చదులకు అర్థం లేక.. ఎందరో విద్యావంతులు ఇలాంటి మోసాగాళ్ల బారిన పడుతున్నారు.. భారీగా డబ్బుతో పాటు.. సమయాన్ని నష్టపోతున్నారు..

వీరి విషయంలో చట్టం ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నా ఈ మోసాలు ఆగడం లేదు.. అందుకే ప్రజలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు వెల్లడిస్తున్నారు.. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు అప్పగించ వద్దని తెలుపుతున్నారు..

You may also like

Leave a Comment