Telugu News » KCR Yajnam : వేద పండితులతో మొదలైన సర్వతోముఖాభివృద్ధి యాగం.. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు..!!

KCR Yajnam : వేద పండితులతో మొదలైన సర్వతోముఖాభివృద్ధి యాగం.. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు..!!

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది. ఈ యాగానికి పండితులు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసారు.

by Venu

గజ్వేల్ (Gajwel) నియోజకవర్గం ఎర్రవల్లి (Erravalli)వ్యవసాయ క్షేత్రంలో తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే రాజశ్యామల మహాయాగంలో కేసీఆర్‌ (KCR) దంపతులు పాల్గొంటారు. తెలంగాణ (Telangana) ఏపీ (AP) కర్ణాటక (Karnataka)కి చెందిన 251 రుత్వికులతో ప్రారంభం అయిన ఈ యాగం విశాఖ శారద పీఠం ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ యాగాన్ని పర్యవేక్షిస్తున్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం అవుతుందని తెలిపారు. మరోవైపు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది. ఈ యాగానికి పండితులు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసారు. గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేసారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది.

కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపనను వేద పండితులు నిర్వహించారు.

వేద పండితులు అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. అంతకు ముందు యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్‌ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. కాగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు ఈ యాగంలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment