Telugu News » KCR : గజ్వేల్‌-కామారెడ్డిలో కేసీఆర్‌ కు పోటీగా అంతమంది నామినేషన్ వేశారా..?

KCR : గజ్వేల్‌-కామారెడ్డిలో కేసీఆర్‌ కు పోటీగా అంతమంది నామినేషన్ వేశారా..?

గజ్వేల్‌ (Ghazwal)లో సుమారుగా 190, కామారెడ్డి (Kamareddy)లో 140కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు అంటున్నారు.. మరోవైపు విద్యార్థులు, యువత, రైతులు, అమరవీరుల కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యంతో గజ్వేల్‌, కామారెడ్డిలో పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు.

by Venu

రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. నేడు నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. మరోవైపు మధ్యాహ్నం 3.00 గంటలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసింది.. ఈ నెల 3న నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి
10వ తేదీ వరకు మొత్తం 1518 నామినేషన్లు (Nominations) దాఖలు అయ్యాయని.. రెండు, మూడు సెట్ల చొప్పున మరికొందరు దాఖలు చేయడంతో వాటిని తీసివేయగా మొత్తం 1,345 మంది నామినేషన్స్ సమర్పించినట్లు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది.

మరోవేపు గత ఎన్నికల్లో నమోదైన నామినేషన్లతో పోలిస్తే ఈసారి వెయ్యికంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైనట్టు సీఈఓ (CEO) కార్యాలయం వెల్లడించింది. వారు చెప్పిన లెక్కల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12.00 గంటల సమయానికే నామినేషన్ల సంఖ్య 3,114కు చేరుకోగా.. చివరి మూడు గంటల్లో పలు చోట్ల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయని.. అందువల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు.

ఈసారి గజ్వేల్‌ (Ghazwal)లో సుమారుగా 190, కామారెడ్డి (Kamareddy)లో 140కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు అంటున్నారు.. మరోవైపు విద్యార్థులు, యువత, రైతులు, అమరవీరుల కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యంతో గజ్వేల్‌, కామారెడ్డిలో పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. వీటిలో ఎన్ని రిజెక్టు అవుతాయనేది ఈ నెల 13న తెలుస్తుందని అంటున్నారు.

మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,399 నామినేషన్లు దాఖలు కాగా అందులో 456 రిజెక్ట్ అయ్యాయని, మరో 367 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు.. చివరకు 1821 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 1,569 మందికి డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారని అధికారులు వెల్లడించారు.. కాగా మల్కాజిగిరిలో 52 మంది అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అయితే ఆ ప్లేస్‌ను ఈసారి గజ్వేల్, కామారెడ్డి ఆక్రమిస్తున్నాయని అధికారులు అంటున్నారు.

You may also like

Leave a Comment