రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముఠా రెచ్చిపోతోంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలు(Intoxicants) అలవాటు చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, గంజాయి ముఠా(Cannabis gang) యువతే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్కూళ్లు, కాలేజీలకు దగ్గరగా ఉండే కిరాణ దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాలను ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎస్‌వోటీ పోలీసులు(SOT Police) అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad)లోని మాదాపూర్(Madhapur)లోని తనిఖీలు నిర్వహించారు.
నానక్ రామ్ గూడ(Nanakramguda)లో కిరాణ షాపు నిర్వహిస్తున్న అనురాధబాయి అనే మహిళ గంజాయి విక్రయిస్తోంది. ఎస్‌వోటీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో కిరాణ షాపులో 300గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా దూల్‌పేట్ నుంచి గంజాయిని సేకరించి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఆమె వద్ద నుంచి 39 గంజాయి ప్యాకెట్లు (300 గ్రాములు), రూ.1200 నగదు, 1 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.