Telugu News » Garlic price hike: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. కిలో ఎంతంటే..?

Garlic price hike: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. కిలో ఎంతంటే..?

ఇటీవల కురిసిన అకాల వర్షాలు(Heavy Rains) నిత్యావసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి ధర కిలో రూ.400లకు పైగా చేరింది.

by Mano
Garlic price hike: Huge increase in garlic prices.. How much is a kilo..?

ఇటీవల కురిసిన అకాల వర్షాలు(Heavy Rains) నిత్యావసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో పేద ప్రజలకు ఊపిరిసలపడంలేదు. తాజాగా ఆ లిస్టులో వెల్లుల్లి(Garlic) వచ్చి చేరింది. ప్రతీ కూరలో వినియోగించే వెల్లుల్లి అమాంతం పెరిగిపోయింది.

Garlic price hike: Huge increase in garlic prices.. How much is a kilo..?

ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి ధర కిలో రూ.400లకు పైగా చేరింది. దీంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతుందనే భయాందోళనలు మొదలవుతున్నాయి. మామూలుగా కూరలతో పాటుగా మాంసాహార వంటకాల్లో ఎక్కువగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వినియోగిస్తుంటారు.

కొత్త పంట మార్కెట్‌లోకి రావటానికి సమయం పడుతుండటమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఈ ధరలు సాధారణ స్థితికి రావాలంటే మరో రెండు, మూడు నెలలు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు రెండు నెలల్లో భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెల్లుల్లి ఎక్కవగా పండించే నాసిక్, పూణే, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మహారాష్ట్ర అంతటా పంట దిగుబడి కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వెల్లుల్లి ధరలకు రెక్కలు వచ్చాయి.

You may also like

Leave a Comment