జమ్మూకశ్మీర్లో ఐదు లోక్సభ స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతనాగ్- రాజౌరీ స్థానం నుంచి ఇద్దరు మాజీ సీఎంలు బరిలో ఉన్నారు. ఒకరు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫీ (Mehbooba Mufti) కాగా మరొకరు డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad).
తాజాగా కాంగ్రెస్ పార్టీని(Congress Partry) ఉద్దేశించి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని చూస్తేనే తనకు ఒక్కోసారి విచిత్ర భావన కలుగుతోందన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందేమోనని కొన్నిసార్లు అనుమానం కలుగుతోందంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిగొలుపుతోంది. కాంగ్రెస్లో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని, కానీ అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదని విమర్శించారు.
సమస్యలు లేవనెత్తినప్పుడు బీజేపీ భాష మాట్లాడుతున్నామని విమర్శించేదని, అలాంటి సందర్భంలో ఆ పార్టీనే బీజేపీని గెలిపించాలని కోరుకుంటుందేమోనని చాలాసార్లు అనిపించిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు తేవాలని, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ కొందరు సీనియర్లు (జీ-23 గ్రూపు) సోనియా గాంధీకి గతంలో లేఖ రాశారు.
దేశంలో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలని ఆయన సుమారు రెండేళ్ల క్రితం ఆజాద్ కాంగ్రెస్ను వీడారు. అప్పట్లో అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు ఆజాద్. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని యువ నాయకత్వం వల్లే భారమైన హృదయంతో పార్టీని వీడినట్లు ఆయన అప్పుడు ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆజాద్ పాటు కపిల్ సిబల్ వంటి వారు పార్టీపై అసహనం వ్యక్తం చేశారు.