Telugu News » Ginger Water : పరగడుపున అల్లం వాటర్.. ఆరోగ్యానికి ఎంతో బెటర్..!

Ginger Water : పరగడుపున అల్లం వాటర్.. ఆరోగ్యానికి ఎంతో బెటర్..!

వావ్ అనిపించేలా టేస్టీగా ఉండే ఈ అల్లం టీ తాగితే మైండ్ కి కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. అంతే కాదు అల్లాన్ని ఎండబెట్టి పొడి చేస్తే శొంఠిగా మారుతోంది. ఈ శొంఠి కూడా ఎన్నో అద్భుత ఔషధగుణాలను కలిగి ఉంటుంది..

by Venu

అల్లం (Ginger) ఇది లేని కూరలను ఊహిస్తేనే తినాలనిపించదు. నిత్య జీవితంలో అల్లం వాడటం ఒక భాగం అయింది. అల్లం కేవలం కూరలలో మాత్రమే వాడరు.. కొన్ని రుగ్మతలకు కూడా ఔషధగుణాలను కలిగిన అల్లాన్ని ఉపయోగిస్తారు. ఇంకా అల్లం టీ.. వావ్ అనిపించేలా టేస్టీగా ఉండే ఈ అల్లం టీ తాగితే మైండ్ కి కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. అంతే కాదు అల్లాన్ని ఎండబెట్టి పొడి చేస్తే శొంఠిగా మారుతోంది. ఈ శొంఠి కూడా ఎన్నో అద్భుత ఔషధగుణాలను కలిగి ఉంటుంది.. ఇంతటి అద్భుతమైన అల్లం వాటర్ తో కలిపి తీసుకుంటే ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

షుగర్​ పేషెంట్లకు (sugar patients) బెస్ట్​ : షుగర్​ పేషెంట్లకు దివ్యవౌషధం అల్లం అంటున్నారు ఆరోగ్య నిపుణులు (Health professionals)..పరగడుపున అల్లం నీరు (Water) తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి.. చక్కెర పెరుగుదలను నివారిస్తుందని అంటున్నారు.. మరోవైపు అధిక షుగర్​ వల్ల వచ్చే సమస్యలను అల్లం వాటర్ దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పొట్టకు (stomach)చాలా మేలు : పరగడుపున అల్లం నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం, వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు తొలగించే దివ్యవౌషధం అల్లం వాటర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు అల్లం వాటర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో అల్లం వాటర్ సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు..

బరువు తగ్గిస్తుంది (Reduces weight) : పరగడుపున అల్లం నీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతమవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అల్లం వాటర్ తాగడం వల్ల రోజంతా కేలరీలు బర్న్ చేస్తుందని, కొవ్వు వేగంగా కరిగిపోడానికి తోడ్పడుతోందని హెల్త్ ఎక్స్పర్ట్స్ తెలుపుతున్నారు. అదీగాక శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తుంది. దీనివల్ల సులువుగా బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

చర్మానికి (skin)మంచిది : శరీరంలో పేరుకు పోయిన మురికి, టాక్సిన్స్ ను తొలగించడంలో అల్లం సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో ఎంతో సహాయం అందిస్తుందని తెలుపుతున్నారు ఆరోగ్య నిపుణులు..

అంతేగాక చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో అల్లం వాటర్ ఎంతో తోడ్పడుతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.. కానీ మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఒక వేళ అల్లం వాటర్ ప్లేన్ గా తాగలేని వారు కాస్త తేనె కలుపుకోవచ్చని అంటున్నారు.. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం తేనె వాడకూడదని నిపుణులు తెలుపుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..

You may also like

Leave a Comment