భారతీయ జనతా పార్టీ(BJP) నిర్ణయాలతో భారత్ ఖ్యాతి ప్రపంచ నలుదిశలకు వ్యాపిస్తోంది. ఇటీవల అయోధ్య రామ మందిర నిర్మాణం(Ayodhya Ram Mandir)తో అది రుజువైంది. తాజాగా యూపీ(UP)లోని యోగి ప్రభుత్వం(Yogi Government) మరో అద్భుత కట్టడాన్ని నిర్మించింది. శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో గ్లాస్ స్కై వాక్ వంతెనను ప్రారంభానికి సిద్ధం చేసింది.
ఈ వంతెనను రూ.3.70 కోట్లతో నిర్మించారు. కోదండ అడవుల్లో ఉన్న ఈ గాజు వంతెన 40 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. విల్లు, బాణం ఆకారంలో నిర్మించిన ఈ వంతెన పొడవు 25 మీటర్లు కాగా, రెండు స్తంభాల విల్లుల మధ్య వెడల్పు 35 మీటర్లు. వంతెన లోడ్ సామర్థ్యం చదరపు మీటరుకు 500 కిలోలు అని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రజలు ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు వారు అద్భుతాన్ని చూస్తారు.
ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా నిర్మించిన మొదటి గ్లాస్ స్కైవాక్ వంతెన ఇది. ఇలాంటిదే బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నిర్మించబడి ఉంది. ఇప్పుడు యూపీలోని చిత్రకూట్‌లోని తులసి (శబరి) జలపాతం వద్ద ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇప్పుడు వంతెన పర్యాటకుల కోసం ప్రారంభానికి సిద్ధమైంది. పర్యాటకులు ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు.
వంతెన కిందిబాగాన కనిపించే దట్టమైన అడవి, రాళ్లు, గుట్టలపై నుంచి పడే జలపాతం అందాలు అబ్బురపరుస్తాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ గాజు వంతెనను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జి భవిష్యత్తులో ఎకో టూరిజంలో పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు.