Telugu News » BUS ACCIDENT : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం

BUS ACCIDENT : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం

హర్యానాలో(Haryana) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంజాన్ పండుగ వేళ ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా కొట్టడంతో ఆరుగురు విద్యార్థులు(Six Students died) మృతి చెందగా.. మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

by Sai
School bus overturns in Haryana. Six students die

హర్యానాలో(Haryana) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంజాన్ పండుగ వేళ ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా కొట్టడంతో ఆరుగురు విద్యార్థులు(Six Students died) మృతి చెందగా.. మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మహేంద్ర గఢ్ జిల్లా కనీనా పట్టణంలోని జీఎల్ పబ్లిక్ పాఠశాలకు చెందిన బస్సు గురువారం ఉదయం 30 మంది స్టూడెంట్స్‌తో స్కూల్‌కు బయలు దేరింది.

School bus overturns in Haryana. Six students die School bus overturns in Haryana. Six students die

సరిగ్గా ఉన్నాని గ్రామ సమీపంలో బస్సు డ్రైవర్ ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి(Bus Accident) బోల్తా కొట్టడంతో ఆరుగురు విద్యార్థులు మరణించారు. మరో 15మంది విద్యార్థులకు(15 Students got Injured) గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా స్పందించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.

ఈ ప్రమాదానికి గల కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రంజాన్ పండుగ వేళ పబ్లిక్ హాలిడే అయినప్పటికీ పాఠశాలకు సెలవు ఇవ్వకుండా నడిపిస్తుండటం గమనార్హం.

You may also like

Leave a Comment