సంకల్పం గట్టిదైతే విజయం సైతం వశం అవుతోందని అంటారు.. ప్రస్తుతం ఆలయ పూజారి ఇది నిజమని నిరూపించారు.. గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat)కు చెందిన ఓ హనుమాన్ ఆలయ పూజారి స్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకం సాధించి ఔరా అనిపించారు.. భుజానికి శస్త్రచికిత్స జరిగినప్పటికి.. అందులో 49 ఏళ్ల వయసులో పతకాలు సాధించడంతో.. స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నగరంలోని రోఖాడియా (Rokhadia) ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయం (Hanuman Temple)లో చాలా ఏళ్లుగా సేవలు చేస్తున్నారు పూజారి వందన్ వ్యాస్.. ఆలయంలో పూజలు పూర్తి అయిన అనంతరం.. రోజు నాలుగు గంటలపాటు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానికంగా ఓ జిమ్‌లో ప్రదీప్ మోరీ, జితేస్ జవారేల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. అయితే కొన్నినెలల క్రితం ఉదయ్పుర్లో జరిగిన ఛాంపియన్ షిప్లో వందన్ వ్యాస్ గాయపడ్డారు.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం భుజానికి ఆపరేషన్ జరిగింది. బరువులు ఎత్తద్దని డాక్టర్లు చెప్పినా వినిపించుకొని వందన్ వ్యాస్.. నిరంతర సాధన చేసి ఈ ఘనత సాధించారు. ఈ పతకాలను హనుమంతుడికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన 10వ ప్రపంచ పవర్ లిఫ్టింగ్ అండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో పూజారి పాల్గొన్నారు.
అందులో మాస్టర్-20(76 కిలోలు) విభాగంలోస్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక హనుమాన్జీ ఆశీస్సులతో నేను బంగారు, కాంస్య పతకాలు సాధించాను. రానున్న రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనబోతున్నానని వందన్ వ్యాస్ ఆనందంగా తెలిపారు.